బ్యాంక్ కొత్త భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చెయ్యాలి
సాలూరు,ఆగస్టు 28,(4th Estate News)
సాలూరు మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన గ్రామస్థులు ప్రజాదర్బార్ లో పాల్గొని పి.ఏ. సి.ఎస్ బ్యాంక్‌కు కొత్త భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని స్త్రీ,శిశు సంక్షేమ శాఖ, గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ని అభ్యర్థించారు.
గ్రామ ప్రజల అభ్యర్థనపై మంత్రి వెంటనే సానుకూలంగా స్పందించి, సంబంధిత అధికారులతో చర్చించి అవసరమైన నిధులను త్వరితగతిన మంజూరు చేయించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే మామిడిపల్లిలో పి.ఏ. సి .ఎస్ బ్యాంక్ కార్యకలాపాలను త్వరలోనే నూతన భవనంలో ప్రారంభించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని మంత్రి స్పష్టం చేశారు.