
- సాలూరు రూరల్,ఆగస్టు 26,(4th Estate News)
ఆగస్ట్ 26 న సాలూరు మండలం మామిడిపల్లి లో ఆకస్మికంగా విజిలెన్స్ అధికారులు శ్రీ పొలమాంబ రైతు డిపో, సూర్య గాయత్రి ఏజెన్సీ లో ఎరువులు షాపులలలో తనిఖీ చేయడం జరిగింది.పొలమాంబ రైతు డిపో లో పోటాష్ , డిఏపి ఎరువు ఈ పాస్ కి గౌడోన్ లో ఉన్న స్టాకును తేడా ఉండటంవల్ల సుమారు నాలుగు లక్షల విలువగల బస్తాలకు స్టాప్ సేల్ ఇవ్వటం జరిగింది..ప్రస్తుత ఉన్న పరిస్థితులలో ఎరువులును ఖచ్చితంగా ఈ పాస్ మిషన్ లో నమోదు చేసిన తరువాత బిల్ మంజూరు చేసిన తరువాత మాత్రమే రైతుకు ఎరువులు ఇవ్వాలని, విజిలెన్స్ సిఐ రవిప్రసాద్ గారు చెప్పడం జరిగింది.గ్రౌండ్ లెవెల్ స్టాక్ కి ఈ పి ఓ ఎస్ లో స్టాక్ కి తేడా ఉండకూడదు అని తెలియచేసారు..రైతులను ఎట్టి పరిస్థితులలో ఇబ్బంది కలిగించరాదని, అధిక ధరలకు అమ్మ కూడదని , యూరియా తో లింక్ లు అయినటువంటి ఎరువులు ఇవ్వరాదు అని తెలియచేసారు.ఈ తనిఖీ లలో ఏ డి ఏ, వ్యవసాయ అధికారి, విజిలెన్స్ ఎస్ఐ రామారావు, ఏఈఓ తిరుపతిరావు పాల్గొనడం జరిగింది.