ఆర్ జి ఎల్ వరి నారుమడులకు అగ్గి తెగులు
పాచిపెంట రూరల్,ఆగస్టు 28,(4th Estate News)
చిరుజల్లులు, మబ్బులు వాతావరణం ఎక్కువగా ఉన్నప్పుడు అధిక యూరియా వేసినప్పుడు అగ్గి తెగులు ఆశిస్తుందని వ్యవసాయ అధికారి కే. తిరుపతిరావు అన్నారు పి. కొనవలస గ్రామంలో నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా వరి నారుమళ్లను పరిశీలించారు ఆర్జిఎల్ వరి రకంలో అగ్గి తెగులు ఆశించిందని అలాగే కాండం తొలిచూపు కూడా ఆశించిందని తెలిపారు. తెగుళ్ళకు వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు యూరియా ఎక్కువగా వేయకూడదని తెలిపారు. అగ్గి తెగులు ఆకులపై కన్ను ఆకారపు మచ్చలను ఏర్పరుస్తుందని నివారణకు సాఫ్ లేదా ట్రై సైకలాజోల్ లేదా అజాక్సిస్ట్రోబిన్ ఒక లీటర్ అన్నిటికి ఒక మిల్లీమీటర్ ముందును కలిపి మందులలో ఒకదానిని పిచికారి చేసుకోవాలని లేదా సూడోమోనాస్ మందును చేను బాగా తడిచేటట్టు పిచికారి చేసుకోవడం ద్వారా అగ్గి తెగులును నివారించుకోవచ్చని తెలిపారు. కాండం తులుచు పురుగు నివారణకు కార్ టాప్ హైడ్రోక్లోరైడ్ గుళికలు ఎకరానికి 7 కిలోలు లేదా పౌడర్ లీటర్ నీటికి రెండు గ్రాములు కలిపి పిచికారి చేసుకోవాలని సూచించారు.
వరి పొట్ట దశలో నానో యూరియా : రైతులు రెండవ దఫా ఎరువును చిరు పొట్ట దశలోపు వేసుకుంటారని, నానో యూరియా పిచికారి ద్వారా నత్రజని పంటకు సమర్థవంతంగా అందించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీసిఎన్ఎఫ్ సిఆర్పి విజయ్ వి ఏ ఏ లావణ్య పాల్గొన్నారు.