పాచిపెంట,ఆగస్టు 26,(4th Estate News)
పాచిపెంట మండలం పనుకువలస గ్రామం లో సేవా లాల్ ట్రైబల్ డెవలప్మెంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణకు సహాయపడే మట్టి విగ్రహాలతో వినాయక చవితి సంబరాలు జరుపుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమం లో బీజేపీ నాయకులు రావేళ్ల లక్ష్మణ రావు, డాక్టర్ హేమా నాయక్,సంస్థ సభ్యులు కల్పన, యువత అధిక సంఖ్యలో హాజరయ్యారు.