వినాయకుని ప్రతిమలు పంపిణీ లో సిరమ్మ
విజయనగరం,ఆగస్టు 26,(4th Estate News)
సిరమ్మ పంచిన వినాయకుని ప్రసాదాలు కోసం వర్షం తో లెక్క చేయకుండా ఎగసిపడిన జనం
26 ఆగస్టు నెల 2025, వినాయక చవితి సందర్భంగా విజయనగరం కోట జంక్షన్ లో ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్, వై.యస్.ఆర్.సి.పి.జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త మజ్జి శ్రీనివాస రావు (చిన్న శ్రీను) కుమార్తె, చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ పాల్గొని వర్షం తో లెక్క చేయకుండా స్థానిక పట్టణ ప్రజలకు మట్టి వినాయక ప్రతిమలు, వినాయకుని ప్రసాదాలు పూజాసామగ్రి(అటుకులు,బెల్లం, శనగలు,వినాయక విధి విధాన పుస్తకాలు) మంగళవారం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలందరూ మట్టి వినాయకునితోనే పూజించాలని ఇది పర్యావరణానికి దోహద పడుతుందన్నారు.హిందువులకు వినాయకచవితి తొలి పండుగని, వినాయకుని ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని కోరుకుంటున్నట్లు ఆమె చెప్పారు.
ఈ కార్యక్రమంలో చిన్న శ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షులు తోట వాసు, చిన్న శ్రీను సోల్జర్స్ సభ్యులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.