
సాలూరు,ఆగస్టు 27,(4th Estate News)
— *గిరిజన సంఘాలు ఆవేదన.*
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పై తప్పుడు ఆరోపణలతో, తప్పుడు ప్రచారంతో సోషల్ మీడియా లో కొన్ని చానల్ లో కథనాల,ప్రసారాల రూపం లో దుష్ప్రచారం చేస్తున్నారని, గిరిజన మంత్రి అయిన తర్వాత తన ఎదుగుదల ఓర్వలేక దుష్ప్రచారం చేస్తున్నారని గిరిజన సంఘ నాయకులు జలుమూరు మణికుమార్, ప్రధాన కార్యదర్శి గిరిజన ఐక్యవేదిక, మంచాల ఈశ్వరరావు, అధ్యక్షులు మన్యం గిరిజన సేవా సంఘం వారు తీవ్రంగా ఖండిస్తున్నారని పత్రికాముఖంగా తెలిపారు. గిరిజన సంక్షేమ శాఖ అనేది చాలా పెద్ద శాఖ, ఈ శాఖలో ఎంతోమంది అధికారులు పనిచేస్తుంటారు,ఎవరో చేసిన పనికి గిరిజన మహిళ అని చిన్న చూపు చూస్తూ గిరిజన సంక్షేమ శాఖ మంత్రిని బాధ్యులు చేయడం సరికాదు.
గుమ్మడి సంధ్యారాణి గత 20 సంవత్సరాలుగా ఎన్నో రాజకీయ ఓడిదడుగులు పడుతూ, పార్టీ కోసం పని చేస్తూ గిరిజనులకోసం నిరంతరం పనిచేస్తూ తన ఎదుగుదల ఓర్వలేక దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. గిరిజన సంక్షేమ శాఖ ద్వారా 1300 కోట్లు తో రోడ్లు అభివృద్ధి చేశారని, మారుమూల గిరిజన గ్రామాలకు డోలుమోతలు ఉండకుండా అభివృద్ధి పనులు చేశారని గిరిజన సంఘ నాయకులు తెలిపారు. గిరిజన సంక్షేమ శాఖ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ అనే అధికారి అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడిన వ్యవహారములో మంత్రి గిరిజన బిడ్డ, గిరిజన మహిళ ఎదుగుదల చూసి ఓర్వలేక ఎన్టీవీ తప్పుడు కథనాలు ప్రచారం చేస్తుందని, గిరిజన సంక్షేమ శాఖలో ఏసీబీకి పట్టుబడిన అధికారికి, గిరిజన శాఖ మంత్రి వారికి ఏమిటి సంబంధం అని ప్రశ్నిస్తున్నామని, ఈ విషయం పైన మంత్రి తరపున న్యాయ పోరాటం చేస్తామని గిరిజన సంఘ నాయకులు జలుమూరు మణికుమార్, మంచాల ఈశ్వరరావు తెలిపారు.
గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అని చూడకుండా ఏటువంటి ఆధారాలు లేకుండా మంత్రి పైన తప్పుడు కథనాలు ప్రచారం చేయడం తగదని మంత్రి కి ప్రచారం చేస్తున్న చానల్స్ క్షమాపణ చెప్పాలని లేదంటే జాతీయ ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని, గిరిజల మీద తప్పుడు ప్రచారాలు చేస్తే గిరిజనుమంతా చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తున్నామని సాలూరు మార్కెట్ యార్డ్ బోర్డు డైరెక్టర్ దోనేరు ఆనంద్ కుమార్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.