సాలూరు,ఆగస్టు 27,(4th Estate News)
“ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంద్యారాణి పై బులుగూ మీడియా, వైసీపీ ప్రోత్సహిత సోషల్ మీడియా వర్గాలు ప్రచారం చేస్తున్న అబద్ధాలనూ, అవాస్తవాలనూ మా గిరిజన బంధువులు గట్టిగా తిప్పికొడుతున్నారు*.
*గిరిజన సమాజ సమస్యలు, కష్టాలు దగ్గర నుండే అనుభవించి, మాకు ఎప్పుడూ అండగా నిలబడిన నేత సంద్యారాణి . ఆమె ఎప్పుడూ గిరిజనుల పక్షానే పోరాడారు. అందుకే మా గిరిజన సోదరులు చెబుతున్నారు – “మా కష్టాల్లో మాతో ఉన్న సంద్యారాణి , భవిష్యత్తులో ఎదురయ్యే ప్రతి సవాల్లో కూడా మా పూర్తి మద్దతు ఆమెకు ఉంటుంది” అని.
*అవాస్తవ కథనాలు రాసి గిరిజన సమాజాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్న వైసీపీ మీడియా ప్రచారాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మంత్రి గుమ్మిడి సంద్యారాణికి మేమంతా అండగా ఉంటాం. ఆమెతోనే మేమున్నాం, గిరిజన సమాజం అంతా ఆమె వెనక బలమైన ఐకమత్యంతో నిలబడి ఉంటుంది.” అని గిరిజన నాయకులు మండల గిరిధర్ అన్నారు.