
పాలకొండ,ఆగస్టు 26,(4th Estate News)
పార్వతీపురం జిల్లా కలెక్టర్ వారిని కలెక్టర్ బంగ్లా నందు పాలకొండ నియోజకవర్గ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ కలిసి నియోజకవర్గం లో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి పథకం ద్వారా సి.సి. రోడ్లు, బి. టి రోడ్లు మంజూరు చేయమని కోరుతున్నారు. సదరు విషయం పై జిల్లా కలెక్టర్ వారి స్పందించ అక్కడే ఉన్న డి.డబ్ల్యూ,ఏం.ఏ పథక సంచాలకులు మంజూరు నిమిత్తం ఫైల్ పెట్టమని ఆదేశించారు. ఈ సందర్బంగా మన్యం జిల్లా కలక్టర్, పాలకొండ నియోజకవర్గం శాసనసభ్యులు జిల్లా ప్రజలందరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేయ్యడం జరిగింది.