మట్టి వినాయకులతో పర్యావరణ హితం:మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

ఆంధ్రప్రదేశ్

 

సాలూరు,ఆగస్టు 26,(4th Estate News)

సాలూరు టౌన్ తహాసిల్దార్ ఆఫీస్ జంక్షన్ వద్ద మట్టి వినాయక విగ్రహాలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేసి, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా స్త్రీ,శిశు సంక్షేమ శాఖ గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ
గణేష్ నవరాత్రి వేడుకలు అందరూ ఎంతో ఉత్సాహంగా, భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని, కానీ పర్యావరణానికి హాని కలగకుండా జరుపుకోవడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు.
• ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వినాయక విగ్రహాలు నీటి వనరులను తీవ్రంగా కాలుష్యం చేస్తాయని, ఆ కాలుష్యం మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని గుర్తు చేశారు.
• మట్టి వినాయక విగ్రహాలను వినియోగించడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడడమే కాకుండా భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణం అందించే అవకాశం కలుగుతుందని వివరించారు.
• చిన్నారులు, యువత, మహిళలు ముందడుగు వేసి మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్టించాలని, తమ కుటుంబం నుంచి సమాజానికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు.
మంత్రి మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తూ, ప్రజలతో సత్సంబంధాలు నెలకొల్పి, పర్యావరణహితమైన ఉత్సవాల ప్రాముఖ్యతను మరోమారు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *