గ్రీన్ వరల్డ్,నీడ్ సంస్థల వారి వినాయక చవితి సంబరాలు…

ఆంధ్రప్రదేశ్

 

గ్రీన్

సాలూరు,ఆగస్టు 26,(4th Estate News)

మట్టి తో తయారుచేసిన ప్రకృతికి హానికరం కాని వినాయక విగ్రహాలతో ఈ వినాయక చవితిని ఆనందంగా బాధ్యతగా జరుపుకోవాలని నీడ్ సభ్యులు పి. వేణుగోపాలరావు, మోహన్ ,వంశీ గ్రీన్ వరల్డ్ సభ్యులు సంతోష్ కుమార్ శర్మ పాణిగ్రాహి, చప్ప శ్రీరామ్ పిలుపునిచ్చారు. ప్లాస్టర్ అఫ్ పారిస్ వినాయకుల వల్ల ప్రకృతికి హానికరం ఈ కారణం చేత మట్టి వినాయకులతో 2025 వినాయక చవితి సంబరాలు అంబరాన్ని తాకేలా సరదాగా జరుపుకోవాలని కోరారు. సుమారు 551 మట్టి వినాయకుల పంపిణీ ఆగస్టు 26 మంగళవారం సాయంత్రం స్థానిక బోసు బొమ్మ సెంటర్ లో పంపిణీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *