
ఒకేషనల్ ఎలక్ట్రానిక్స్ ల్యాబ్ ప్రారంభం
పాచిపెంట,ఆగస్టు 25,(4th Estate News)
పాచిపెంట జిల్లా పరిషత్ హై స్కూల్ లో సోమవారం ఒకేషనల్ ఎలక్ట్రానిక్స్ ల్యాబ్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే. ఈశ్వరరావు, ఒకేషనల్ సబ్జెక్ట్ టీచర్ బి సునీల్ కుమార్, పాఠశాల అధ్యాపకులు, నాన్ టీచింగ్ స్టాఫ్ పాల్గొన్నారు. ఈ ల్యాబ్ ద్వారా విద్యార్థులు థియరీ నాలెడ్జ్ తో పాటు ప్రాక్టికల్ పరిజ్ఞానం కూడా పొందుతారు. విద్యార్థులు ఎలక్ట్రానిక్ పరికరాలు ఎలా పని చేస్తాయో తెలుసుకుంటూ, వాటిని సురక్షితంగా వాడటం, సరైన రీతిలో అమర్చడం, ప్రయోగాలు చేయడం వంటి వాటిలో నైపుణ్యాన్ని పెంపొందించుకుంటారు. ఈ అనుభవం ద్వారా వారిలో ఆవిష్కరణకు ప్రేరణ నిచ్చి పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను అభివృద్ధి చేసే దిశగా దోహదపడుతుంది. ఈ ల్యాబ్ విద్య, నైపుణ్యం లక్ష్యానికి అనుగుణంగా విద్యార్థుల భవిష్యత్తుకు దోహదపడే గొప్ప మెట్టు అని వక్తలు అభిప్రాయపడ్డారు.