
ఎరువుల అమ్మకాలు సక్రమంగా లేకపోతే చర్యలు :
విజిలెన్స్ సీఐ రవిప్రకాష్
పాచిపెంట రూరల్,ఆగస్టు 25,(4th Estate News)
విజిలెన్స్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రవిప్రకాష్ పాచిపెంట మండలం లోని ఎరువుల షాప
ఎరువుల అమ్మకాలు సక్రమంగా లేకపోతే చర్యలు :
విజిలెన్స్ సీఐ రవిప్రకాష్
పాచిపెంట రూరల్,ఆగస్టు 25,(4th Estate News)
విజిలెన్స్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రవిప్రకాష్ పాచిపెంట మండలం లోని ఎరువుల షాపులను ఆకస్మికం గా తనికీ చేశారు. స్థానిక ఎస్ఐ సురేష్ తో కలిసి తనిఖీ నిర్వహించారు. ఎక్కడైనా అక్రమ నిల్వలు వున్నా, లేదా అధిక ధరలకు అమ్మినా, లేదా ఎరువులు పక్కదారి పట్టించిన తీవ్రమైన చర్యలు ఉంటాయని ఇకపై 24 గంటలు ఎరువులపై పూర్తి స్థాయి నిఘా ఉంచడం జరుగు తుందని చెకపోస్ట్ దగ్గర కూడా పూర్తిగా నిఘా ఉంచడం జరుగుతుందని తెలిపారు. ఈపాస్ రిజిస్టర్ లు లైసెన్స్ లు పరిశీలించి ఎ మండలం లో ఎరుపు ఆ మండలం రైతులకు మాత్రమే ఇవ్వాలని చిన్న సన్నకారు రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఎక్కడైనా అనధికారిక విక్రయాలు జరిగితే స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తో కలిసి కేసులు బుక్ చేయాలని వ్యవసాయ అధికారికి సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి కే. తిరుపతిరావు పాల్గొన్నారు.మండలంలో ఎరువులపై నిరంతర నిఘా కోసం తాహాసిల్దార్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వ్యవసాయ అధికారితో కలిసి స్పెషల్ టీం పనిచేస్తుందని తెలిపారు.