సాలూరు,ఆగస్టు 22,(4th Estate News)
5వ శ్రావణ శుక్రవారం సందర్భంగా సాలూరులో పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు హోమాలు కుంకుమ పూజలు అమ్మవార్లకు ప్రత్యేక అలంకారాలు తో ఆలయాలు సుందరంగా, చూడముచ్చటగా, భక్తుల కోలాహలంతో సాలూరు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆఖరి శ్రావణ శుక్రవారం సందర్భంగా శ్రీ లలిత హోమం అతి వైభవం గా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి కరుణాకటాక్షాలకు పాత్రులయ్యారు.