పెద్ద కంచూరు,ఆగస్టు 23,(4th Estate News)
రైతులకు సాగు ఖర్చులను తగ్గించి దిగబడలను పెంచడం కోసం ఆధునిక సాగు సాంకేతిక పద్ధతులను వివరించడం కోసం ప్రధానమంత్రి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం కింద పెద్ద కంచూరు గ్రామంలో రైతుల కు సమావేశం నిర్వహించడం జరిగింది . ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయ అధికారి కొల్లి తిరుపతిరావు మాట్లాడుతూ, గిరిజన రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులకు దూరంగా ఉన్నారని సాగులో నూతన మెలకువలు నేర్చుకోవడం ద్వారా పోడు వ్యవసాయంలో కూడా అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. దీనిలో భాగంగా కలుపు నివారణకు సైకిల్ లీడర్ పోడు పద్ధతిలో ఒక చక్కని పరిష్కారమని సూచించారు.అలాగే కోడిపంటలన్నీ పూర్తిగా వర్షాధారంగా పండిస్తారు. కాబట్టి తక్కువ నీటిని వినియోగించుకుని వర్షాభావాన్ని తట్టుకొని కూడా అధిక దిగుబడులను ఇచ్చే గంటెలు, చోడీ అతి తక్కువ కాలంలో పూర్తయ్యే సామలు వంటి పంటలను పండించుకోవాలని వరి పంటను నీళ్లు ఉన్నచోట మాత్రమే పండించాలని తెలిపారు. అలాగే రాబోయే రబీ సీజన్ లో ఉలవ విత్తనాలు చల్లుకోవాలని తెలిపారు. పురుగులు తెగుళ్ల నివారణకు వేప గింజల కషాయం బాగా పనిచేస్తుంది సూచించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న శతాభి సర్పంచి రామయ్య మాట్లాడుతూ మినుములు, వలిసలు విత్తనాలను సబ్సిడీపై అందించాలని అన్ని గిరిజన గ్రామాలలో ఇలాంటి సమావేశాలను ఏర్పాటు చేయడం ద్వారా గిరిజన రైతుల లో కొంతవరకు మార్పుని సాధించవచ్చు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు యశోద కృష్ణ ప్రకృతి వ్యవసాయ సిబ్బంది సురేష్ రాజు సంజీవి పాల్గొన్నారు.