"నీడ్" ఆధ్వర్యంలో సేంద్రీయ ఎరువులు పై అవగాహన కార్యక్రమం...
పాచిపెంట రూరల్,ఆగస్టు 23,(4th Estate News)
"నీడ్" స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో పాచిపెంట మండలం నీలంవలస గ్రామంలో మహిళలకు, రైతులకు సేంద్రియ ఎరువులపై అవగాహన కల్పించడం జరిగింది.
తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని ఎలా పొందాలనేది సేంద్రియ ఎరువుల ద్వారా పండించిన పంటలను వాడకం వల్ల ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారని రైతులకు తెలియజేయడం జరిగింది.
అనంతరం కిచెన్ గార్డెనింగ్, పెరటి తోటల పెంపకం గురించిన అవగాహన కల్పించి, స్థలాల్లో నాటుకునేందుకు ఉచితంగా విత్తనాలు – బెండ, బీర, అనప, ముల్లంగి, చిక్కుడు మొదలైన విత్తనాలను రైతులకు ఉచితంగా "నీడ్" స్వచ్ఛంద సేవా సంస్థ అందించింది.
ఈ కార్యక్రమంలో బృందం మహేష్, మోహన్,కృష్ణ, వసంత పాల్గొని, గిరిజన రైతులలో సుమారు 110 మందికి ఉచితంగా విత్తనాలను పంపిణీ చేయడం జరిగింది.
పాచిపెంట, సాలూరు, మక్కువ మండలాలలో రైతులకు సేంద్రియ వ్యవసాయం పై అవగాహన కల్పిస్తున్నామని "నీడ్" డైరెక్టర్ పీ.వేణు గోపాలరావు తెలిపారు.