
సాలూరు,ఆగస్టు 19,(4th Estate News)
1. సాలూరు పట్టణంలో నుంచి జరగబోయే వినాయక ఉత్సవాలకు మండపాలకై సంబంధిత కమిటీ వారు తప్పనిసరిగా పోలీసు వారు అనుమతి పొందవలెను.
2. ఉత్సవ కమిటీ సభ్యులు పూర్తి వివరములు మండపాలు యొక్క ప్రదేశం, ఉత్సవాలు జరిపే తేదీలు, నిమజ్జనం జరిపే తేదిలు పూర్తి వివరములు కూడిన సమాచారాన్ని పోలీసు వారికి ముందస్తుగా తెలియపరచవలెను.
3. ఉత్సవ కమిటీ సభ్యులు పోలీసు వారు సూచన మేరకు *9 దినములు* ( *నవరాత్రులు* ) లోపు నిమజ్జనం పూర్తి చేయవలెను.
4. ఉత్సవ కమిటీ కమిటీ వారు మండపాలు వద్ద ఏర్పాటు చేయు వినోద కార్యక్రమాలకు మైకులకు పోలీసువారి ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవలె ను.
5. మండపాలు నందు విద్యుత్తు అగ్నిప్రమాదాలు జరగకుండా అన్ని రకాల చర్యలు ఉత్సవ కమిటీ వారు తీసుకోవలెను… సంబంధిత శాఖల యొక్క అనుమతి కూడా తప్పనిసరి.
6. కమిటీ సభ్యులు తమ మండపాలను, వాటి వద్ద నిర్వహించబోయే వినోద కార్యక్రమాలు సమయములో ట్రాఫిక్, శాంతి భద్రతల విఘాతం కలుగకుండా ఎప్పటికప్పుడు పోలీసు వారికి సహకరించవలెను.
7. గణేష్ ఉత్సవాలు జరిగే సమయంలో గానీ నిమజ్జనం సమయంలో గానీ, డీజేలకు ఎటువంటి అనుమతి లేవు.
8. కమిటీ సభ్యులు మండపాల వద్ద నిఘా కెమెరాలు ఏర్పాటు చేసుకోవలెను.
9. మండపాలు వద్ద 24 గంటలు కమిటీ సభ్యులు ఉంటూ ఏదైనా అవాంఛనీయ కుండా సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవలె ను.
10. మండపాలు వద్ద మరియు పరిసర ప్రాంతాల్లో అశ్లీల డాన్సులు ఆసాంఘిక, మరియు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిషేధం.
11. గణేష్ ఊరేగింపు, నిమజ్జనం కార్యక్రమాలు రాత్రి 11 గంటల్లోపు ముగించవలెననీ
. సాలూరు పట్టణ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బొమ్మిడి అప్పలనాయుడు తెలిపారు.