
పాచిపెంట రూరల్, ఆగస్టు 19,(4 Th Estate News)
ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పత్తి మొక్కజొన్న వంటి పంటలలో నీరు నిల్వ ఉండకుండా కాలువలు ఏర్పాటు చేసుకోవాలని వర్షాలు వెలసిన తర్వాత పంటలపై మల్టీకే ఒక కేజీ నానో యూరియా అర లీటరు కలిపి తప్పనిసరిగా పిచికారీ చేసుకోవాలని వ్యవసాయ అధికారి సూచించారు. కుడుమూరు గ్రామంలో నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో మాట్లాడుతూ వర్షాలు వెలిసిన తర్వాత పంటలకు తెగుళ్లు వచ్చే అవకాశం ఉందని అలాగే పోషక లోపాలు ఏర్పడతాయని వీటిని నివారించుకోవాలని తెలిపారు. పత్తి పంటలో కాయ కుళ్ళు ఎండు తెగులు వచ్చే అవకాశం ఉందని నివారణకు ప్రోపికోనజోల్ ఒక లీటరు నీటికి ఒక మిల్లీమీటర్ కలిపి పిచికారి చేసుకోవాలని రసం పీల్చు పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటే థయో మెథ క్సమ్ 0.5 గ్రాములు ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలని వీటిలో నానో యూరియా మరియు మల్టీకే కలిపి పిచికారి చేయడం ద్వారా పోషక లోపాలను నివారించవచ్చని తెలిపారు. నివారణ చర్యలు చేపట్టాలని కోరారు అనంతరం గ్రామాలలో ఉన్న మొక్కజొన్న పత్తి పంటలను పరిశీలించారు అన్నదాత సుఖీభవ రాని రైతులు ఆగస్టు 20 లోగా గ్రీవెన్స్ లో పెట్టుకోవాలని సూచించారు. ఏకపంట విధానాన్ని వదిలి పలు పంటలు విధానాన్ని అవలంబించాలని గట్ల మీద అదనపు ఆదాయాన్నిచ్చే చెట్లను లేదా కంది వంటి పంటలను వేసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సహాయకులు యశోద కృష్ణ ప్రకృతి సేద్య సీఆర్పీలు సురేష్ రాజు అప్పన్న మరియు రైతులు పాల్గొన్నారు