సాలూరు,ఆగస్టు 18,(4Th Estate News)
"మున్సిపల్ కమిషనర్
టీ.టీ.రత్నకుమార్ సూచనలు మేరకు కురుస్తున్న వర్షాలు దృష్ట్యా సాలూరు పురపాలక సంఘం పరిధిలో గల వార్డుల్లో కాలువలో అడ్డంకులు ఏర్పడి రోడ్లపై నీరు ప్రవహించకుండా సిబ్బందితో చర్యలు తీసుకోవాలని జైపూర్ రోడ్లు ఉన్న ఆర్టీసీ కాంప్లెక్స్ ,పి. ఎల్.తంగ్ రాజు హాస్పిటల్ ఆనుకొని ఉన్న కాలువలో నీటి ప్రవాహానికి ఇబ్బంది లేకుండా అడ్డంకులు తొలగించడమైనది.
శానిటరీ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ, శానిటరీ, సచివాలయ సిబ్బందితో వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని కొన్ని హోటల్లో తనిఖీలు నిర్వహించారు హోటల్స్ లో చుట్టుప్రక్కల పరిసరాలు తినే పదార్థాలు తయారు చేసిన కార్ఖానీలు పరిశుభ్రంగా ఉంచుకొని వచ్చిన కస్టమర్లకు వేడి నీటిని సప్లై చేస్తూ తమ హోటల్ లో మిగిలిన ఆహార పదార్థాలను ఫ్రిజ్లో నిల్వ లేకుండా నాణ్యమైన ఆహారాన్ని అందించాలని సూచించారు.
అలాగే పట్టణ పరిధిలో ఉన్న స్క్రాప్ కొట్టుల్లో ప్లాస్టిక్ డబ్బాలు, కాళీ బాటిల్స్, మరి ఇతర స్క్రాప్ వస్తువులు తమ స్క్రాప్ షాపులు ముందు విచ్చలవిడిగా రోడ్లపై ఉంచకుండా తమ షాపుల లోపల భద్రపరుచుకోవాలని హెచ్చరించడం జరిగింది.
మారుతున్న వాతావరణం దృష్ట్యా వర్షాల కారణంగా నీటు నిల్వలు ఏర్పడి ఆ నీటిలో దోమల యొక్క లార్వా వృద్ధి చెంది వాటి ద్వారా మలేరియా,డెంగ్యూ వంటి వ్యాధులు ప్రభలే అవకాశం ఉన్నందున ఎక్కడా నీటి నిలువ లేకుండా చూసుకోవాలని సానిటరీ సూపర్వైజర్లకు, సెక్రటరీలకు సూచించడం జరిగింది.