పాంచాలి,ఆగస్టు 18, (4Th Estate News)
పాంచాలి గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థి పల్లి ఉమామహేశ్వరరావు పాంచాలి గ్రామం నుండి తొలిసారిగా డీఎస్సీ కి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పాంచాలి సర్పంచ్ గూడేపు యుగంధర్ జడ్పీ హైస్కూల్ చైర్మన్ దండి వరలక్ష్మి,చైర్మన్ ప్రతినిధి దండి కోటి అభినందనలు తెలియజేశారు.