
సాలూరు,ఆగస్టు 17,4 th Estate News
శనివారం మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సాలూరు పట్టణంలోని గొల్ల వీధిలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు.
వేడుకల్లో భాగంగా స్థానిక గోపికలు, గోపాలకుల సాంప్రదాయ రీతిలో శ్రీకృష్ణుని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిన్నారులు శ్రీకృష్ణుడు, రుక్మిణి, గోపికల వేషధారణలో ఆకట్టుకునే నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు.